యూపీఐ వినియోగదారుల డబ్బులు సేఫ్.. ఆర్బీఐ గుడ్‌న్యూస్

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. చదువురాని వారి దగ్గరినుంచి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా సైబర్ నేరాల బారినపడుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఏటా వేల కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల పాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ‘1 అవర్ పాస్’ నిబంధనను తెరపైకి తెచ్చింది. సాధారణంగా యూపీఐ లేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా డబ్బులు పంపినపుడు క్షణాల్లో అవతలి వ్యక్తి అకౌంట్లో డబ్బులు పడిపోతాయి.

పొరపాటుగా ఒక వ్యక్తికి పంపాల్సిన డబ్బులు ఇంకో వ్యక్తికి పంపినా.. సైబర్ మోసం జరిగి అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినా .. ఆ డబ్బు వెంటనే అవతలి వ్యక్తి అకౌంట్లో పడిపోతుంది. ఇలా జరిగినపుడు కంప్లైంట్ ఇచ్చినా లాభం ఉండదు. అందుకే ఆర్బీఐ ‘1 అవర్ కూలింగ్ ఆఫ్ పీరియడ్‌‘ నిబంధనను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీలకు ఈ నిబంధనను వర్తింప జేయాలని చూస్తోంది. ఇలా చేయటం వల్ల పొరపాటున లేదా మోసపూరితంగా డబ్బులు మన అకౌంట్‌ నుంచి కట్ అయితే దానిపై బ్యాంకుకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. డబ్బులు తిరిగి మన అకౌంట్లో పడిపోతాయి.

ఆర్బీఐ 1 అవర్ కూలింగ్ ఆఫ్ పీరియడ్‌‌ను త్వరలో అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. అయితే, ఎంత మొత్తం నగదు లావాదేవీలకు ఈ నిబంధనను వర్తింపజేస్తుందన్నది ఇప్పటికైతే సస్పెన్సే. ఒకవేళ ఆర్బీఐ కూలింగ్ ఆఫ్ పీరియడ్‌‌ను అమలు చేసినా.. మర్చంట్ చెల్లింపులలో ఎలాంటి మార్పులు ఉండవు. వ్యాపారులకు చేసే చెల్లింపులు ఎప్పటిలాగే తక్షణమే జరుగుతాయి. తక్కువ మొత్తం నగదు లావాదేవీలపై కూడా ఎలాంటి ప్రభావం ఉండదు. మీరు క్రమం తప్పకుండా డబ్బులు పంపే వారిని (Trusted recipients) ఈ నిబంధన నుంచి మినహాయించవచ్చు. వారిని వైట్ లిస్ట్‌లో పెట్టుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *