ముఖ్య వార్తలు
AP అంటే అడ్వాన్స్‌డ్ ప్రదేశ్… AMCAతో మరో ప్రూఫ్!

పొరుగు రాష్ట్రాల రాజకీయ రాడార్లకు దొరక్కుండా… శత్రుదేశాల రాడార్లకూ సైతం చిక్కని AMCA (Advanced Medium Combat Aircraft) స్టీల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ ఎలా దక్కించుకుందో చెప్పే మైండ్‌బ్లోయింగ్ ఇన్‌సైడ్ స్టోరీ ఇది!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఒక ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దిగితే ప్లానింగ్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి పుట్టపర్తి AMCA ప్రాజెక్ట్ క్లాసిక్ ఉదాహరణగా నిలిచింది.

తమిళనాడు ప్రభుత్వం మూడేళ్లుగా కష్టపడి, హోసూర్‌కు ఈ ప్రాజెక్ట్ వస్తుందని ధీమాగా ఉన్న వేళ… ఏపీ కేవలం 30 రోజుల్లోనే ₹15,803 కోట్ల ఈ మెగా ప్రాజెక్ట్‌ను సైలెంట్‌గా తనవైపు తిప్పుకుంది. మే 15న రక్షణ మంత్రి Rajnath Singh చేతుల మీదుగా పుట్టపర్తిలో శంకుస్థాపన కూడా పూర్తైంది.

తమిళనాడు మూడేళ్ల శ్రమ.. హోసూర్ ప్లాన్!

భారతదేశపు ఐదో తరం అధునాతన యుద్ధ విమానమైన AMCA తయారీ కేంద్రాన్ని పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన హోసూర్ వద్ద ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం మూడేళ్లుగా కేంద్ర రక్షణ శాఖను కోరుతోంది.

హోసూర్‌లో విలువైన వందల ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వడానికి సిద్ధమైంది. అంతేకాదు, డిజైన్ నోడల్ ఏజెన్సీ అయిన Aeronautical Development Agency బెంగళూరుకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉండటం కూడా పెద్ద ప్లస్‌గా భావించింది.

అందుకే ఈ ప్రాజెక్ట్ తమకే వస్తుందని తమిళనాడు గట్టిగా నమ్మింది.

ఏప్రిల్ 2026: 21 రోజుల జెట్ స్పీడ్ ఆపరేషన్!

ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడు — “ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా ఏపీకి రావాలి… ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమకు రావాలి” అని నిర్ణయించుకున్నారు.

విషయం బయటకు పొక్కితే తమిళనాడు అలర్ట్ అవుతుందని భావించి పూర్తి గోప్యత పాటించారు.

ఏప్రిల్‌లో ఏపీ ప్రభుత్వం చూపించిన స్పీడ్ ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది:

టైమ్‌లైన్

ఏప్రిల్ 9 – కేంద్ర రక్షణ శాఖతో ప్రాథమిక చర్చలు ప్రారంభం
ఏప్రిల్ 20 – అధికారిక ప్రతిపాదనలు కోరిన ఏపీ
ఏప్రిల్ 24 – కేవలం 4 రోజుల్లో పూర్తి నివేదికలు సమర్పణ
ఏప్రిల్ 28 – కేంద్ర రక్షణ శాఖ నుండి అధికారిక అంగీకారం
ఏప్రిల్ 29 – పుట్టపర్తి స్థల పరిశీలన పూర్తి
ఏప్రిల్ 30 – ఏపీ క్యాబినెట్ ప్రత్యేక సమావేశం, తక్షణ ఆమోదం

ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 30 వరకు… కేవలం 21 రోజుల్లోనే పేపర్‌వర్క్ నుంచి క్యాబినెట్ అప్రూవల్ దాకా మొత్తం ప్రక్రియ పూర్తి అయింది.

అంతేకాదు, ఏరోస్పేస్ & డిఫెన్స్ పాలసీ కింద ప్రత్యేక జీవోలు 48 గంటల్లో పాస్ చేసి, సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా నీరు, విద్యుత్, రన్‌వే విస్తరణ వంటి అనుమతులన్నీ ఒకే నెలలో పూర్తి చేశారు.

ఇదే అసలు “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”.

పుట్టపర్తి ఎందుకు ప్లస్ అయింది?

1. బెంగళూరుకు దగ్గర

Kempegowda International Airport కు కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల రాకపోకలకు సౌలభ్యం కలిగింది.

2. సిద్ధంగా ఉన్న మౌలిక వసతులు

జాతీయ రహదారి, రైల్వే స్టేషన్, విమాన సదుపాయాలు ముందే ఉండటం కీలకంగా మారింది.

3. వ్యూహాత్మక ప్రెజెంటేషన్

ఈ భౌగోళిక ప్రయోజనాలను కేంద్ర రక్షణ శాఖ ముందు బాబు టీమ్ సమర్థంగా ప్రెజెంట్ చేయడం పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది.

AMCA కోసం ఏర్పాటు చేస్తున్నది కేవలం ప్రొడక్షన్ యూనిట్ కాదు… ఇది Core Integration & Flight Testing Centre, అంటే విమానం యొక్క అసలు సమీకరణ, పరీక్షలు, ధృవీకరణ జరిగే హృదయం.

తమిళనాడు సోషల్ మీడియాలో పెదవి విరుపులు

ఈ వార్త బయటకు రావడంతో తమిళనాడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది.

“మన రాష్ట్రంలో రాజకీయ అస్థిరత, నిర్ణయాల్లో వేగం లేకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేజారిపోయింది” అంటూ పలువురు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు మీమ్ క్రియేటర్లు:

కష్టపడి డిజైన్ చేసింది బెంగళూరు…
వసతులున్నది తమిళనాడులో…
కానీ లక్ కొట్టేసింది మాత్రం ఆంధ్రప్రదేశ్!

అంటూ సెటైరికల్ మీమ్స్‌తో సోషల్ మీడియాను నింపేశారు.

విమర్శలు తాత్కాలికం… అభివృద్ధి శాశ్వతం!

పొరుగు రాష్ట్రంలో చేసిన రెండు రోజుల ఎన్నికల ప్రచారంపై విమర్శలు చేసిన వారికి… పుట్టపర్తి AMCA ప్రాజెక్ట్, కర్నూలు డ్రోన్ సిటీ, అనకాపల్లి నేవల్ సిస్టమ్స్ రూపంలో వచ్చిన ₹15,803 కోట్ల సమాధానం ఇది.

తమిళనాడు తన పారిశ్రామిక బలాన్ని నమ్ముకుంటే… ఆంధ్రప్రదేశ్ తన అల్ట్రా-స్పీడ్ బ్యూరోక్రసీ, పొలిటికల్ నెట్‌వర్క్‌తో గేమ్‌ను మార్చింది.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నట్లు…

AP అంటే కేవలం Andhra Pradesh కాదు… Advanced Pradesh!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *